వర్గల్ మండల కేంద్రంలో భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టిఎస్ఐఐసి పరిశ్రమల స్థాపన కోసం తక్కువ ధరకు భూసేకరణ చేశారని ఆరోపించారు. 10 లక్షలలోపు చెల్లింపులు చేసి కోటికి విక్రయించి తమకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేసిన తర్వాతే పనులు చేపట్టాలని రైతులు ఆందోళన చేపట్టారు. ఇళ్ల స్థలాలు సైతం ఇవ్వలేదని ఆరోపించారు.