మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గౌతొజిగూడ గ్రామంలో కుల బహిష్కరణ సంఘటనపై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి అవగాహన కల్పించారు. కుల బహిష్కరణపై హైకోర్టు ఆదేశాల మేరకు గ్రామంలో ప్రజలతో సమావేశం నిర్వహించి రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కల్పించరాదని సూచించారు. తూప్రాన్ ఆర్డిఓ జయచంద్రారెడ్డి, డీఎస్పీ వెంకట్రెడ్డి అధికారులు పాల్గొన్నారు.