విద్యార్థులకు స్వచ్ఛతహి సేవపై అవగాహన
NEWS Sep 23,2024 01:03 pm
ఆందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలో కమిషనర్ ఆదేశానుసారం ప్రశాంత్ ఒకేషనల్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులతో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థినిలకి రంగోలి ముగ్గుల పోటీలు, పరిశుభ్రత, ప్లాస్టిక్ నివారణపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు స్వచ్చతహి సేవ కార్యక్రమంపై అవగాహన కల్పించి, ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. అక్టోబర్-2 గాంధీ జయంతి వరకు ఈ వేడుక సంబరాలు జరుపుకోవాలని కోరారు.