ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
NEWS Sep 23,2024 12:53 pm
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకరరావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఇంటర్ పోల్‌కు సీబీఐ లేఖ రాసింది. హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తికి సీబీఐ అనుమతి ఇచ్చింది. ఇంటర్ పోల్ ద్వారా ప్రభాకరరావు, శ్రావణ్‌రావులకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ప్రభాకరరావు, శ్రావణ్‌రావులు అమెరికాలో ఉన్నట్లు గుర్తించారు.