అరెస్టును ఖండించిన బీఆర్ఎస్ శ్రేణులు
NEWS Sep 23,2024 12:59 pm
కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ని, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ని, మాజీ మంత్రి తాటికొండ రాజయ్యని అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పోకడకు ఈ అరెస్టులు నిదర్శనమన్నారు. ఆసుపత్రికి బీఆర్ఎస్ డాక్టర్ల బృందం వెళ్తే ఎందుకు అరెస్ట్ చేయించారో వివరణ ఇవ్వాలన్నారు. ఇప్పటికే 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలకు పలుమార్లు హౌస్ అరెస్టులు, అక్రమ అరెస్టులు చేసి రిమాండ్ చేసారని ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదన్నారు.