ప్రపంచ రికార్డు సృష్టించిన బుమ్రా
NEWS Sep 23,2024 11:59 am
టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు సృష్టించారు. ప్రపంచ క్రికెట్‌లో 2024లో అత్యధిక వికెట్లు తీసుకున్న ప్లేయర్‌గా బుమ్రా నిలిచారు. ఈ ఏడాది అన్ని ఫార్మాట్‌లలో కలిపి 14 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా ఏకంగా 47 వికెట్లు తీశారు. 43 వికెట్లతో శ్రీలంక ప్లేయర్ హసరంగా రెండో స్థానంలో ఉన్నారు. కాగా, బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులోనూ బుమ్రా 5 వికెట్లు పడగొట్టారు.