సుప్రీంకోర్టులో లడ్డూపై 2 పిటిషన్లు
NEWS Sep 23,2024 11:48 am
తిరుమల లడ్డూ వివాదం సుప్రీంకోర్టుకి చేరింది. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టుకు 2 వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. BJP నేత సుబ్రహ్మణ్యస్వామి, YCP నేత వైవీ సబ్బారెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరగాలని కోరారు. విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా నిపుణులతో విచారణ చేయించాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు.