17 నుండి స్వచ్ఛత హీసేవ కార్యక్రమం
NEWS Sep 23,2024 10:35 am
మున్సిపల్ కమిషనర్ టీ మోహన్ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛత హీసేవ కార్యక్రమంలో భాగంగా, మెట్ పల్లిలోని అతి పురాతనమైన శ్రీ చెన్నకేశవ స్వామినాథ వారి పుష్కరిణి (కోనేరు) ప్రజలు, స్వచ్ఛంద సేవ సంస్థలతో కలిపి కోనేరు చుట్టూ ఉన్న పిచ్చి గడ్డిని తొలగిస్తూ క్లీనింగ్ చేసి అందులో ఉన్న నీటిలో బ్లీచింగ్ పౌడర్ జరిగిందని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయం చుట్టూ దాని పరిసరాల్లో క్లీన్ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం మున్సిపల్ సిబ్బందితో పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.