పలు హోటళ్లపై మున్సిపల్ కమిషనర్ దాడులు
NEWS Sep 23,2024 10:37 am
మున్సిపల్ కమిషనర్ టి మోహన్ ఆదేశాలతో పట్టణంలోని నాణ్యత ప్రమాణాలు పాటించని పలు హోటళ్లపై దాడులు నిర్వహించి, 4000 జరిమానా విధించారు. పరిశుభ్రత నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని, హోటల్స్ లో ప్లాస్టిక్ కవర్ కాకుండా జూట్ బ్యాగులు వాడాలని, నూనె రోజుకోసారి మార్చవలెనని ఫ్రిజ్లో పెట్టిన చికెన్ గాని మటన్ గాని ఫిష్ కానీ వాడ రాదని, మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ ప్రవీణ్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు ముజీబ్ నిజాం నాయక్ పాల్గొన్నారు.