అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామని బొమ్మూరు పోలీసులు ఆదివారం తెలిపారు. పిడింగొయ్కికి చెందిన తాతారావు నామవరం గ్రామంలో అక్రమంగా మద్యం అమ్ముతుండగా తాతారావును అరెస్ట్ చేశామన్నారు. అతని వద్ద నుంచి 12 మద్యం సీసాలను సీజ్ చేశామన్నారు. అక్రమంగా మద్యం అమ్మే వారిపై నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.