ప్రజావాణి సమస్యలకు సత్వర పరిష్కారం
NEWS Sep 23,2024 09:17 am
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే సమస్యలకు సత్వర పరిష్కార మార్గం చూపాలని కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి తో కలసి స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వస్తారన్నారు.