ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
NEWS Sep 23,2024 12:48 pm
గురుకుల పాఠశాలల్లోని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని సోమవారం టీఎస్ యుటిఎఫ్, గురుకుల జేఏసీ ఆధ్వర్యంలో సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు శాంతి కుమారి మాట్లాడుతూ విద్యాహక్కు చట్టం ప్రకారం అన్ని యాజమాన్యాల గురుకుల పాఠశాలల్లో పనివేళలు ఒకే రకంగా ఉండాలని కోరారు. గురుకుల ఉపాధ్యాయులకు హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలన్నారు.