పాఠశాల ప్రవేశాలకు తుది ఎంపిక
NEWS Sep 23,2024 12:30 pm
అరకు: అరకులోయ గురుకులం క్రీడా పాఠాశాలలో 2024-25 సంవత్సరానికి 5,7,8,9 తరగతులలో ప్రవేశాల కొరకు రాష్ట్ర స్ధాయి తుది ఎంపిక పోటీలను క్రీడా పాఠశాల ప్రిన్సిపాల్ PSN మూర్తి, SMC చైర్మన్ కె రమేష్ ప్రారంభించారు. 5వ తరగతికి 55మంది, 7వ తరగతికి 4గురు, 8వ తరగతికి 5గురు, 9వ తరగతికి 9గురు మొత్తం 73 మంది పాల్గొన్నారు. పోటీలను పీడీ రామారావు, కోచ్ లు రాజుబాబు, సూరిబాబు, గణపతి, కొండలస్వామి, మాధవ్, శ్రీనివాస్ పర్యవేక్షిస్తున్నారు. వైటిసి ప్రిన్సిపాల్ వర్మ పాల్గొన్నారు.