వేంపేటలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన
NEWS Sep 23,2024 12:00 pm
స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా మెట్‌పల్లి మండలం వేంపేట గ్రామంలో ఇంటింటి తిరుగుతూ ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ తడి, పొడి చెత్త వేరువేరుగా ఉంచాలని కోరారు. కార్యక్రమంలో ఏఎన్ఎం సువర్ణ, కార్యదర్శి అశోక్ గౌడ్, కారోబార్ భూమాచారి, ఆశా వర్కర్లు పద్మ, లక్ష్మీ, దీప, సంజీవ తదితరులున్నారు.