మల్లాపూర్: మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామంలో కోతుల నుంచి రక్షణ కోసం మక్కా చేను చుట్టూ విద్యుత్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి జెల్ల పెద్ద ముత్తన్న మృతికి కారణమైన గుండా సాయన్నను అరెస్ట్ చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈనెల 18న ముత్తన్న తన వరి పొలంకు వెళ్తుండగా.. సాయన్న ఏర్పాటు చేసిన విద్యుత్ ఫెన్సింగ్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు చేసి అరెస్ట్ చేశామన్నారు.