కేంద్రంలో రూ.2 లక్షల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ జనాభాలో 60 శాతం బీసీలు ఉన్నప్పటికి సబ్ ప్లాన్ లేకపోవడం బాధాకరం అన్నారు. బీసీల పట్ల చిత్తశుద్ది ఉంటే వెంటనే సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని కోరారు.