పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
NEWS Sep 23,2024 09:15 am
"ఆహారం ఆరోగ్యం దేశ సౌభాగ్యం" అనే నినాదంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పోషణ మాసంలో భాగంగా భీమరం మండల పసునూర్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆకు కూరలు, కూరగాయలు ,పండ్లు, గ్రామీణ ప్రాంతాలలో లభించే చిరుధాన్యాలు గింజ ధాన్యాలలో ఎక్కువ పోషకాలు ఉంటాయాన్నారు. ముర్రు పాల ప్రాముఖ్యత, కేవలం తల్లిపాలు ఆరు నెలల వరకు, ఆ తర్వాత అనుబంధ పోషక ఆహారంతో పాటు తల్లిపాలు పట్టాలన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాజా మాజా సర్పంచ్ లచ్చనాయక్ పాల్గోన్నారు.