తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రతకు గురైన నేపథ్యంలో పలువురు యువకులు జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి జగిత్యాల నుండి కొండగట్టు ఆలయం వరకు పలువురు యువకులు పాదయాత్ర చేశారు. లడ్డును అపవిత్రతకు గురిచేసిన వారిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని యువకులు డిమాండ్ చేశారు.