శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో అక్టోబర్ 3-12 వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలు
NEWS Sep 23,2024 12:41 pm
వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలో అక్టోబర్ 3 నుంచి 12 వరకు దేవీ నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ వినోద్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 9న ఉదయం మూల నక్షత్ర పుస్తక రూపిణి మహా సరస్వతి పూజ, 10న దుర్గాష్టమి మహిషాసుర మర్దిని అమ్మవారికి మహాపూజ, 11న పూర్ణాహుతి, బలిహరణం, తెప్పోత్సవం 12న విజయదశమి సందర్భంగా ఆయుధపూజ, శమీపూజ నిర్వహించనున్నట్టు తెలిపారు.