లయన్స్ క్లబ్ ఆఫ్ అయిలాపూర్ ఆధ్వర్యంలో రేకుర్తి కంటి ఆసుపత్రి వారి సౌజన్యంతో కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కంటి ఆపరేషన్ అవసరం ఉన్న వారిని గుర్తించి ఉచితంగా రేకుర్తి కంటి ఆసుపత్రికి పంపించి ఆపరేషన్ చేయిస్తామని లయన్స్ క్లబ్ ఆఫ్ అలాపూర్ సభ్యులు తెలిపారు. ఉచిత వైద్య శిబిరంలో దాదాపు 150 మందికి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ అయిలాపూర్ అధ్యక్షులు నగునూరి గంగాధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.