రైతు మృతికి కారణమైన వ్యక్తి అరెస్టు
NEWS Sep 23,2024 12:12 pm
మల్లాపూర్ మండలం కుస్తాపూర్ గ్రామానికి చెందిన జెల్ల పెద్ద ముత్తయ్య వ్యవసాయ పనులకోసం గురువారం వెళ్లాడు,అదే గ్రామానికి చెందిన గొండ సాయన్న కోతుల బెడదతో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విద్యుత్ మోటర్ నుండి పంట చుట్టు ఇనుప కంచెలకు విద్యుత్ తీగలు పెట్టాడు. అది తెలియని ముత్తన్న అటువైపుగా వెల్లగా విద్యుత్ తీగలకు కరెంటు రావటంతో మృతి చెందాడు. గొండసాయన్న పరారీ కాగా కుస్తాపూర్ వద్ద సాయన్నను మెట్ పల్లి సీఐ నిరంజన్ రెడ్డి అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలిస్తున్నట్టు తెలిపారు.