రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఆధ్వర్యంలో మందమర్రి ఏరియాలోని బొగ్గుగనులపై నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ సింగరేణి సంస్థ గత ఏడాది సాధించిన వాస్తవ లాభాల్లో నుంచి కార్మికులకు 33 శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు.