శ్రీవారి ఆలయంలో శాంతిహోమం
NEWS Sep 23,2024 12:27 pm
తిరుమల శ్రీవారి ఆలయంలో ఉదయం శాంతిహోమం జరిగింది. ఆలయంలోని యాగశాలలో ఆగమ పండితులు, అర్చకులు హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ఉదయం 10గంటల వరకు శాంతి హోమం కొనసాగింది. హోమం పూర్తి తరువాత లడ్డూ పోటుతో పాటు ఆలయంలో పంచగవ్యాల తో సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు