ప్రైవేటు పాఠశాలల నూతన కార్యవర్గం
NEWS Sep 23,2024 12:30 pm
గూడపల్లి: మలికిపురం మండలం గూడపల్లిలో కోనసీమ జిల్లా ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. సంగం అధ్యక్షునిగా రమణారావు, కార్యదర్శిగా అయ్యప్ప నాయుడు, కోశాధికారిగా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. రాజోలు డివిజన్ అధ్యక్షుడిగా రత్నరాజు, కార్యదర్శిగా చిన్న, కోశాధికారిగా కిరణ్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యదర్శి తులసి విష్ణు ప్రసాద్ కార్యక్రమంలో పాల్గొన్నారు.