గల్ఫ్ దేశం ఖతర్‌లో కోరుట్ల మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన ఎన్నారై ముహమ్మద్ నసీర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రకటించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి సర్కార్ జీవో విడుదల చేసే విధంగా కృషి చేసిన గల్ఫ్ జేఏసీ బృందానికి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఎన్నారై సెల్ బృందానికి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.