తిరుపతి లడ్డూను అపవిత్రం చేసిన ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని అంబాజీపేట మండలం మొసలపల్లి బీజేపీ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీకాకుళపు పవన్ డిమాండ్ చేశారు. దానికి వ్యతిరేకంగా ఆదివారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వెంటనే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. స్థానికులు పాల్గొన్నారు.