నాటు బాంబుల తయారీ ముఠా అరెస్ట్
NEWS Sep 23,2024 12:38 pm
కోనరావుపేట: కోనరావుపేట మండలంలో నాటు బాంబులు తయారు చేస్తూ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన రాజలింగం పలువురికి నాటు బాంబులు, గన్ పౌడర్ విక్రయించారు. ఈ నాటు బాంబులతో జంతువులను వేటాడుతున్నట్లు గుర్తించిన పోలీసులు గ్రామాలపై నిఘా పెట్టారు. పోలీసులు 47 నాటు బాంబులు, గన్ పౌడర్ను స్వాధీనం చేసుకుని రాజలింగాన్ని అరెస్ట్ చేసినట్లు చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.