మాంసం దుకాణంలో ఆకస్మిక తనిఖీలు
NEWS Sep 23,2024 12:44 pm
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది పలు చికెన్ మటన్ వ్యాపారస్తుల షాప్ లను తనిఖీలు చేశారు 40 మైక్రోన్ కన్నా తక్కువ ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న, అపరిశుభ్రత పాటిస్తున్న దుకాణాలకు 500 నుంచి 2000 వరకు జరిమానా విధించారు. మరోసారి ఇలాంటి తప్పు జరిగితే వారి షాప్ ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తానని హెచ్చరించారు. బట్ట సంచులను ఉపయోగించాలని సూచించారు.