సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.917 టీఎంసీలకు గాను సోమవారం ఉదయం 6 గంటల వరకు ప్రస్తుత నీటి నిల్వ 29.708 టీఎంసీలు ఉంది. ఇన్‌ఫ్లో 3670 , అవుట్ ఫ్లో 3323 క్యూసెక్కులుగా ఉందని ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు.