నాటు బాంబులను తయారు చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసి నిందితుల నుంచి నాటు బాంబుల తయారీకి సంబంధించిన ముడి సరుకులను స్వాధీనం చేసినట్లు పోలీసులు తెలిపారు. చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండల కేంద్రంలోని ధర్మారం గ్రామానికి చెందిన ముడికే. మల్లయ్యకు చెందిన గేదె గత 2 రోజుల క్రితం గ్రామ శివారులో గడ్డి మేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నాటు బాంబు పేలి, గేదె దవడ భాగానికి తీవ్ర గాయం కాగా గేదె యజమాని మల్లేశం ఫిర్యాదు కేసు నమోదు చేశారు పోలీసులు.