'ఓం శాంతి శాంతి శాంతిః' మూవీ రివ్యూ
NEWS Jan 30,2026 03:23 pm
మలయాళ హిట్ జయ జయ జయ జయహే రీమేక్‌గా వచ్చిన ఓం శాంతి శాంతి శాంతిః గృహహింస అనే సున్నిత అంశాన్ని గోదావరి నేపథ్యంతో ఆవిష్కరించింది. కన్నవాళ్ల కట్టుబాట్లు, భర్త ఓంకార్ చూపించే అహంకారాన్ని ఎదిరించే ప్రశాంతి కథ. ఈషా రెబ్బ సహజ నటనతో ఆకట్టుకోగా, తరుణ్ భాస్కర్ పాత్రలో ఒదిగిపోయాడు. ఫస్టాఫ్ బలంగా సాగుతుంది. సెకండాఫ్‌లో తీవ్రత తగ్గినా, కొన్ని మాటలు ఆలోచింపజేస్తాయి. సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లే, కామెడీ ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. మహిళల హక్కులపై ప్రశ్నలు లేవనెత్తే ఈ చిత్రం ఓసారి చూడొచ్చు. రేటింగ్: 2.25/5