తిరుమలలో ఆలయంలో
శాంతి హోమం, పంచగవ్యప్రోక్షణ
NEWS Sep 22,2024 05:15 pm
తిరుమలలో తయారు చేసే ప్రసాదాల్లో కల్తీ జరిగిందని గుర్తించిన నేపథ్యంలో.. ఆగమ సలహామండలి సూచనలతో ఆలయంలో శాంతి హోమం, పంచగ్రవ్యప్రోక్షణ చేయాలని నిర్ణయించినట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. సోమవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు హోమం, పంచగవ్యప్రోక్షణ చేస్తారన్నారు. దేవాదాయ శాఖ తరపున ఏపీలోని అన్ని ఆలయాల్లోనూ హోమాలు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.