చిరంజీవికి చంద్రబాబు అభినందనలు..!
NEWS Sep 22,2024 05:07 pm
దేశ సినీరంగంలో అత్యంత ప్రముఖ నటుడిగా, డాన్సర్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్న మెగాస్టార్ చిరంజీవికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. తన గ్రేస్, నటనతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎనలేని కృషి చేశారన్నారు. ఇది చిరంజీవికి గుర్తింపును పెంచడంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి మరింత గర్వకారణమని చంద్రబాబు ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.