ఇక పల్లె బస్సుల్లోనూ QR కోడ్!
NEWS Sep 22,2024 06:48 pm
కరీంనగర్: పల్లె వెలుగు బస్సుల్లోనూ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికులు సులభంగా ఛార్జీలు చెల్లించేందుకు క్యూఆర్ కోడ్ ను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే సూపర్ లగ్జరీ లాంటి బస్సుల్లో ఈ సదుపాయం ఉండగా ప్రస్తుతం పల్లెవెలుగు బస్సుల్లోకి సైతం తీసుకొచ్చారు. ఉమ్మడి జిల్లాలో 11 డిపోలకు సంబంధించి 811 ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి. ఇందులో 479 ఆర్టీసీ, 332 అద్దె బస్సులు నడుపుతున్నారు.