వేములవాడ: దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం సమీపంలోని చెరువు నిండుకుండలా మారింది. ఇటీవల ఎగువన కురిసిన వర్షాలతో రాజన్న ఆలయ చెరువులోకి భారీగా వరద నీరుచేరింది. దీంతో పూర్తిస్థాయిలో నీరు చేరి నిండుకుండలా మారింది.