ప్లాస్టిక్ వాడుతున్న దుకాణ యజమానులకు జరిమానా
NEWS Sep 22,2024 04:28 pm
మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడుతున్న దుకాణ యజమానులకు కోరుట్ల మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి జరిమానా విధించారు. పట్టణంలోని పలు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా తనిఖీల్లో పలు దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లను స్వాధినపరుచుకుని వారికి 500 రూ. చొప్పున జరిమానా విధించి, హెచ్చరించారు. మరోసారి పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.