దసరా: విశాఖ-అరకు ప్రత్యేక రైళ్ళు
NEWS Sep 22,2024 06:21 pm
దసరా సెలవులలో పర్యాటకుల రద్దీ దృష్ట్యా అక్టోబర్ 5 నుండి 15 వరకు విశాఖ-అరకు మధ్య ప్రత్యేక రైలు(08525-08526) నడుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ-అరకు(08525) రైలు విశాఖలో ఉదయం 8.30 గంటలకు బయలుదేరి 11.30 గంటలకు అరకు చేరుతుంది. తిరుగు ప్రయాణం అరకు-విశాఖ(08526) రైలు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సాయంత్రం 6 గంటలకు విశాఖ చేరుతుంది. రైలు సింహాచలం, కొత్తవలస, ఎస్ కోట, బొర్రాగుహలు వద్ద ఆగనుంది.