సీపీఐ సీనియర్ నాయకులు వజీర్ భేగ్ మృతి
NEWS Sep 22,2024 04:00 pm
సిపిఐ సీనియర్ జిల్లా నాయకులు పన్యాల వజీర్ భేగ్ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. వజీర్ భేగ్ మృత దేహానికి టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలరెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు నరసింహ, జిల్లా కార్యదర్శి సయ్యద్ జలాలుద్దీన్, సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ నివాళి అర్పించారు. సంగారెడ్డిలో 60 సంవత్సరాలుగా సిపిఐ పార్టీ అభివృద్ధికి కృషి చేశారని నాయకులు తెలిపారు