యువత వ్యసనాలకు దూరంగా ఉండాలి
NEWS Sep 22,2024 06:44 pm
డుంబ్రిగూడ మండలం మారుమూల సొవ్వా, గసబ పంచాయితీలోని గ్రామలను అరకు సిఐ హిమగిరి ఆదివారం సాయంత్రం సందర్శించారు. గంజాయి, సారా వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి పండించడం, రవాణా చేయడం నేరమని గ్రామస్తులకు సిఐ అవగాహణ కల్పించారు. గంజాయి రవాణాలో పట్టుబడితే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. అన్లైన్ మోసాలకు పాల్పడకూడదని సూచించారు. సిఐ, ఎస్సీ పురంధర్, పోలీస్ సిబ్బంది ఉన్నారు