పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
NEWS Sep 22,2024 06:24 pm
జగిత్యాల: పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజశ్రీ సూచించారు. జగిత్యాల జిల్లా పొలాస సెక్టార్లో ఆదివారం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ మసోత్సవం నిర్వహించారు. పోషణ మాసోత్సవంలో భాగంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని సూపెర్వైజర్ రాజశ్రీ వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్, ఆశావర్కర్స్, పాల్గొన్నారు.