తంగళ్లపల్లి: పుట్టగొడుగుల పెంపకం పై రైతులు దృష్టి సారించాలని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ శ్రీదేవి పేర్కొన్నారు. తంగళ్ళపల్లి మండలం జిల్లేలలు బాబు జగ్జీవన్రామ్ వ్యవసాయ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లాంట్ పథాలజీ ఆధ్వర్యంలో పుట్టగొడుగుల సాగుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. రైతుల పుట్టగొడుగుల సాగుపై దృష్టిసారిస్తే అదనపు ఆదాయం లభిస్తుందన్నారు