బీజేపీ సభ్యత్వం ఓ మహాత్తర కార్యక్రమం
NEWS Sep 22,2024 06:33 pm
బీజేపీ సభ్యత్వ డ్రైవ్ కేవలం ఒక ప్రోగ్రాం కాదని, పార్టీ విస్తరణ కోసం జరుగుతున్న ఓ మహత్తర కార్యక్రమమని, ఇందులో మోర్చాలు, సెల్స్ క్రియాశీలకంగా పనిచేయాలని బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆదివారం కరీంనగర్లోని రేకుర్తిలోని సాయి మహాలక్ష్మి గార్డెన్లో బీజేపీ మోర్చాల సమావేశంలో ఆయన మాట్లాడారు.