పోచమ్మతల్లి దేవాలయంలో అన్నదానం
NEWS Sep 22,2024 06:30 pm
జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని శ్రీ లోకమాత పోచమ్మ తల్లి దేవాలయం 62వ వార్షికోత్సవం సందర్భంగా మహిళలు అందించిన ఒడి బియ్యంతో అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్పర్సన్ అడువాల జ్యోతి, బీజేపీ జగిత్యాల ఇన్ఛార్జి బోగ శ్రావణి పాల్గొని అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో అనేకమంది భక్తులు పాల్గొని అమ్మవారి కృప కటాక్షాలతో ఉండాలని పూజలు నిర్వహించారు.