మల్లాపూర్: మెట్పల్లి -ఖానాపూర్ రహదారి మధ్యలో మల్లాపూర్ మండలంలోని ఓబులపూర్ తండా గ్రామ సమీపంలో రోడ్డుపై ప్రమాదకరంగా పెద్దగుంతలు ఏర్పడ్డాయి. కొన్నిరోజులుగా సంబంధిత అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెప్పిన పట్టించుకోకపోవడంతో ఓబులపూర్ తండా గ్రామానికి చెందిన యువకులు స్వంత నిధులతో సిమెంట్, కంకరతో గుంతను పూడ్చి మరమ్మతులు చేశారు.