45 ఏళ్ల తర్వాత కలిశారు!
NEWS Sep 22,2024 01:25 pm
మెట్‌పల్లి పట్టణంలో విఆర్ఎం గార్డెన్లో ఆదివారం 1978-1979 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 45 సంవత్సరాల తర్వాత అప్పటి టెన్త్ బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనంలో కుటుంబ సభ్యులతో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. అప్పటి విద్య నేర్పిన ఉపాధ్యాయులు గండ్ర ఆనందరావు, ఎన్ శంకరయ్య, నరసింహారెడ్డిలను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానం చేశారు.