విద్యుత్ షాక్ తో 4 గేదెలు మృతి
NEWS Sep 22,2024 06:34 pm
నారాయణఖేడ్ పట్టణ జంట గ్రామమైన మంగళ్పేట శివారులో విద్యుత్ షాక్ తో నాలుగు పాడి గేదెలు మృతి చెందాయి. ఈరోజు సాయంత్రం పశువులను మేపేందుకు గాండ్ల సతీష్, శివరాజ్ 20 గేదెలను తీసుకెళ్లారు. డిపో సమీపంలో వ్యవసాయ భూముల్లో మేస్తుండగా అక్కడ నీటి గుంతలో నీళ్లు తాగేందుకు వెళ్లి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం ఎర్తింగ్ వైర్ తాకాయి. 4 గేదలు మృతిచెందగా.. మరో 2 గేదెల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.