జగిత్యాల జిల్లా సరిహద్దు సమీపంలోని మెట్‌పల్లి మండలం పాటిమీది తండాకు సమీపంలోని రాళ్ల వాగు అందాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. వాగుపై నుంచి కిందకు నీరు జలపాతంలా ప్రవహిస్తుంటే ప్రజలు వాటి కింద స్నానాలు ఆచరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. వాగు అందాలను కెమెరాలో బంధిస్తున్నారు. రాళ్ల వాగు సమీపంలోని గ్రామాల ప్రజలు జలపాతాన్ని చూడడానికి తరలి వెళ్తున్నారు.