తిరుపతి లడ్డూ విషయంలో
విచారణ చేపట్టాలి: పాలూరి
NEWS Sep 22,2024 06:35 pm
తిరుపతి లడ్డు తయారీలో కల్తీ నూనె వాడకంపై కేంద్రం దర్యాప్తు సంస్థ చే విచారణ చేపట్టాలని బిజెపి రాష్ట్రకార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం డిమాండ్ చేశారు. ఆదివారం కొత్తపేటలో ఆయన మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్దానంతో పాటు అన్నవరం,సింహాచలం అన్ని ఆలయాల్లో కల్తీ నెయ్యి వుందని అనుమానం వ్యక్తం చేశారు.గత వైసిపి ప్రభుత్వం భక్తులకు ఇచ్చే లడ్డూప్రసాదంలో జంతువుల కొవ్వుతో తయారు చేయించి అపచారం చేసారని ఆరోపించారు.