ముమ్మిడివరం నగర పంచాయతీ కమిషనర్ గా పి.రవివర్మ నియమితులయ్యారు. ఇక్కడ పని చేసిన వెంకటరామిరెడ్డి బదిలీ కావడంతో ఆయన స్థానంలో కాకినాడ మున్సిపాలిటీలో శానిటరీ అధికారిగా పని చేస్తున్న రవివర్మ ను ముమ్మిడివరం కమిషనర్ గా నియమిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు.