తూ.గో. జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా చెల్లుబోయిన వేణు
NEWS Sep 22,2024 06:39 pm
తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ బాధ్యతలు చేపట్టారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరు లోని పార్టీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకురాలు, సీఏసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, పార్లమెంటు నియోజకవర్గం ఇంచార్జ్ గూడూరు శ్రీనివాస్, మేడపాటి షర్మిల రెడ్డి, పలువురు నాయకులు సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.